అశోక్ గల్లా హీరోగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం దేవకీనందన వాసుదేవ. కథానాయిక మానస వారణాసి. డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రశాంత్‌వర్మ మాట్లాడారు. ఈ కథ రాసుకున్న తర్వాత చాలామంది హీరోలు మదిలో మెదిలారు. కానీ చివరకు ఇది గల్లా అశోక్ పరమైంది. దీనిపై అతని పేరు రాసుంది. సినిమా చూశాను. చాలా బావుంది. అర్జున్ అద్భుతంగా తీశారు. నిర్మాత బాలకృష్ణ సోమినేని ఖర్చుకు వెనుకాడలేదు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది అని అన్నారు.
అతిథులుగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, దగ్గుబాటి రానా, సందీప్‌కిషన్‌లు యూనిట్ కి శుభాకాంక్షలు అందించారు. అద్భుతమైన కథను అందించిన ప్రశాంత్‌వర్మకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. దర్శకుడు అర్జున్ జంధ్యాల తన విజన్‌తో ఈ కథకు ప్రాణం పోశారు. ట్రైలర్‌ని మించేలా సినిమా ఉంటుంది అని అశోక్ గల్లా నమ్మకం వెలిబుచ్చారు. ప్రశాంత్‌వర్మ కథ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, భీమ్స్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.