బిలియనీర్ ఎలన్ మస్క్, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలను అప్పగించారు డోనాల్డ్ ట్రంప్. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డీఏజీఈ)లో నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ బ్యూరోక్రసీని నియంత్రించడం, వృద్ధా ఖర్చులు నివారించడం, ఫెడరల్ ఏజెన్సీలను మార్చేందుకు మస్క్, రామస్వామిలను నియమించినట్లు ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.