ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. శనివారం రెండు ఫ్లాష్ బాంబు లు ఆయన ఇంటివద్ద పడ్డాయని, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు, నిందితుల వివరాలను 30 రోజుల పాటు ప్రచురించవద్దని కోర్ట్ గ్యాగ్ ఉత్తర్వులు జారీ చేసింది. నెతన్యాహూ ఇంటిపై బాంబులతో దాడి చేయడం అంటే అన్ని హద్దులను దాటడమేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత నెలలోనూ నెతన్యాహూ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది.