Namaste NRI

అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ : ఈశ్వర్‌ కార్తీక్‌   

ఈశ్వర్‌ కార్తీక్‌  దర్శకత్వంలో సత్యదేవ్‌ నటించిన యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ జీబ్రా. ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎస్‌.పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు.  ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ విలేకరులతో మాట్లాడారు . జీబ్రా ఓ కొత్త ప్రపంచం. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కి రియలిస్టిక్‌ ఎలిమెంట్స్‌ బ్లెండ్‌ చేయడం కొన్ని కథలకే కుదురుతుంది. అది జీబ్రా కు కుదిరింది. అన్ని ఎమోషన్స్‌ ఉన్న ఆర్గానిక్‌ కథ జీబ్రా. సినిమా అద్భుతంగా వచ్చింది అని అన్నారు.  బ్యాంకింగ్‌ వరల్డ్‌లో గుప్తంగా జరిగే తప్పుల్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో రాసుకున్న కథ ఇది. బ్యాంకింగ్‌, మనీ లాండరింగ్‌, గ్యాంగ్‌స్టర్‌ ఇలా మూడు ప్రపంచాలను కలిపి ఈ కథ రాశాను. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ని సూచించే యానిమల్‌ జీబ్రా. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాను.

ఈ కథలో నా వ్యక్తిగత అనుభవాలు, పాత్రలు కూడా ఉంటాయి అని చెప్పారు ఈశ్వర్‌ కార్తీక్‌. ఇందులోని ప్రతి పాత్ర కీలకంగానే ఉంటుందని, రవి బస్రూర్‌ అద్భుతమైన సంగీతం అందించారని, మూడు ప్రపంచాలకూ డిఫరెంట్‌ లేయర్‌ మ్యూజిక్‌ ఇచ్చారని, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండియర్‌గా సినిమాను నిర్మిం చారని ఈశ్వర్‌ కార్తీక్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 22న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events