అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా ఆయన సంచలన నిర్ణయం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్‌ను) రష్యా భూభాగంపై దాడికి వినియోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు.
దాంతో అమెరికా అందించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం దక్కినట్లయ్యింది. తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు కొనసాగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.