![](https://namastenri.net/wp-content/uploads/2024/11/b87c51be-597c-4d61-9699-36202c2fdcb5-51.jpeg)
ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్లో నిలిచింది. 3.31 లక్షల మంది విద్యార్థులతో భారత్ మొదటిస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానానికి పరిమితమైంది. 2023-24లో అమెరికా 11.26 లక్షల స్టూడెంట్ వీసాలు జారీచేసింది. నివేదిక ప్రకారం, 2022-23లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2,68,923 కాగా, 2023-24నాటికి 23 శాతం పెరిగి 3,31,602కు చేరుకుంది. ఇందులో మాస్టర్స్, పీహెచ్డీ చేస్తున్న వారు 1,96 లక్షల మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వీరి సంఖ్య 1.65 లక్షలుగా ఉండేది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ మొదటి స్థానంలో నిలబడటం 15 ఏండ్లలో ఇదే తొలిసారి. భారత్లో చదువుతున్న అమెరికా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగినట్టు నివేదిక తెలిపింది. 2021-22లో 331 మంది అమెరికన్ విద్యార్థులు మన దగ్గర చదవగా, 2022-23లో వీరి సంఖ్య 1,355కు పెరిగింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/b3d00086-ff84-4237-b83a-c233d621b400-52.jpeg)