అఫ్గానిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమంటూ ఇచ్చిన హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జరిగిన జీ`20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల మనోభావాలను గమనించాలని సూచించారు. అఫ్గాన్ సమాజంలోని అన్ని వర్గాల కలయికగా ప్రభుత్వం ఉండాలని ప్రపంచం భావిస్తున్నట్టు తెలిపారు. అఫ్గాన్‌ను మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని కోరారు. ఆ దేశ ప్రజలతో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని తెలిపారు.