భారత్, అమెరికా మధ్య సంబంధాలు, బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో శ్వేతసౌధంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొవిడ్, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలపై భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్, అమెరికా బంధం పరిష్కరించగలదని బైడెన్ అన్నారు. మోదీ మాట్లాడుతూ రానున్న దశాబ్దం నిర్మాణంలో బైడెన్ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బైడెన్‌తో భేటీ అనంతరం క్యాడ్ సదస్సులో మోదీ పాల్గొన్నారు.
ఇండో పసిఫిక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిసుస్థిరతలకు ఈ కూటమి కీలకం కానున్నదని సమావేశంలో మోదీ పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో మోదీ భేటీ అయ్యారు. కమల తాతయ్య పీవీ గోపాలన్‌కు సంబంధించిన ఒకప్పటి నోటిఫికేషన్లు, వారణాసికి చెందిన మీనాకారి చెస్‌బోర్డును మోదీ బహుకరించారు.