అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా రెండోసారి ఎంపికయ్యారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం ట్రంప్ గురువారం ఉదయం 9.30 గంటలకు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఓపెనింగ్ బెల్‌ను మోగించారు. అంతకుముందు ఆయన స్టాక్ ఎక్సేంజ్‌లో మాట్లాడుతూ ఇది తనకు లభించిన అద్భుతమైన గౌరవమని తెలిపారు. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపును 2016లో పొందానని, ఇప్పుడు మరోసారి ఆ గుర్తింపు లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జేడీ వాన్స్ పాల్నొన్నారు.