అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చిరకాల స్నేహితుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు నడిచింది. గోవాలోని ప్రముఖ రిసార్ట్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి ఫొటోలను కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.