అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 వరల్డ్‌వైడ్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఇప్పటికే 1000కోట్ల వసూళ్ల మైలు రాయిని దాటింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప-2 చిత్రాన్ని ఆదరిస్తూ నాపై ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికీ కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ భారతీయ సినిమాను ఇంతలా ఆదరిస్తున్నందుకు స్పెషల్ థాంక్స్. ఇది నా ఒక్కడి విక్టరీ కాదు. ఇండియా విక్టరీ అన్నారు.
ఈ విజయానికి క్రెడిట్ అంతా సుకుమార్‌దే. ఆయన విజన్, కష్టానికి ఫలితమే ఈ గ్రాండ్ సక్సెస్. భవిష్యత్తులో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుంది. అయితే ఈ కలెక్షన్ నంబర్స్ అన్నీ టెంపరరీ. ఫ్యూచర్‌లో మరో సినిమా వీటిని దాటేయొచ్చు. కానీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మాత్రం శాశ్వతం. వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు. అల్లు అర్జున్ కష్టానికి లభించిన ప్రతిఫలమే ఈ విజయమని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ ఎగ్జిబిటర్స్ నిమిత్, సంజయ్, శశాంక్ రాజహెడ, యూపీ ఎగ్జిబిటర్ అశుతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.