విక్రమ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. చియాన్ 63 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకుడు. అరుణ్ విశ్వ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ దేశంలోని అత్యుత్తమ నటుల్లో విక్రమ్ ఒకరు. మా సంస్థ నుంచి వస్తున్న మూడవ సినిమాలో హీరో ఆయన కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు మడోన్ అశ్విన్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించను న్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ అలరించే సినిమాగా నిర్మించనున్నాం. ఈ సినిమాకు సంబంధిం చిన ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు. శాంతి టాకీస్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది.