Namaste NRI

డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి.. తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెం గ్రామానికి చెందిన డాక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సాగరిక ఘోష్‌ నుంచి డా.ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి తరపున వైఎస్‌ ప్రెసిడెంట్‌, ఇండియా ఆపరేషన్స్‌ బాలకృష్ణ అవార్డు అందుకున్నారు. తిరుపతిలోని ఎస్‌.వి.మెడికల్‌ కాలేజీలో 1973లో ఎం.బి.బి.ఎస్‌ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్‌ స్టేట్‌ మెడికల్‌ సెంటర్‌లో ఇంటర్నల్‌ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్‌ పూర్తి చేశారు. 1981 కాలిఫోర్నియాలో మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్‌ ప్రొసీజర్స్‌ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ప్రైమ్‌ కేర్‌ మెడికల్‌ గ్రూప్స్‌ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్‌ గ్రూప్‌ ప్రారంభించారు.

                అమెరికాలోని కాలిఫోర్నియాలో 1990లో 150 పడకల అక్యూట్‌ కేర్‌ హాస్పిటల్‌ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికాలో టాప్‌ 10 వైద్య వ్యవస్థలో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌ గుర్తింపు పొందింది. ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి  ఒక చారిటబుల్‌ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events