ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలోనూ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్జీ)లోనూ భారత్‌కు సభ్యత్వం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై తొలిసారి చర్చలు జరిపారు. ఇరువురు నేతల తర్వాత వైట్ హౌస్ నుంచి సంయుక్త ప్రకటన చేశారు. ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థ పురోగతిలో బహుముఖ సహకారాన్ని అందిస్తున్న ఇతర దేశాలకు ఐరాస భద్రత మండలిలో చోటు కల్పించాల్సిందేనన్నారు. ఐరాస భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదననకు మద్దతు ఇస్తున్నట్లు బైడెన్ తెలిపారు.
అంతర్జాతీయ అణు వ్యాపారాన్ని నియంత్రించే 48 సభ్య దేశాల ఎన్‌ఎస్జీ గ్రూప్‌లో భారత్ చేరికకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉన్నది. మరో 10 దేశాలకు రెండేండ్ల పదవీ కాలం ఉంటుంది. శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది.