యంగ్ హీరో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం మరోసారి వాయిదా పడిరది. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాని మరో వారం వాయిదా వేస్తూ, అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్లని విడుదల చేశారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించిన సినిమా ఇది. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఆమని, మురళి శర్మ, జయప్రకాష్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం :ప్రదీశ్ ఎమ్.శర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)