వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఈ సినిమా ఒకెత్తు. కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో రుజువైంది. చూసిన ఆడియ న్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటున్నారు అని అన్నారు. ఇందులో వినోదమే కాకుండా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా ఉందని, అందుకే ఆడియన్స్‌కి నచ్చిందని సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి తెలిపారు. ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తున్నదని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 25న సినిమా విడుదలైంది.