అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.తాజాగా మరో రికార్డు ఈ సినిమా ఖాతాలో చేరింది. 21రోజుల్లో 1705 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా జైత్రయాత్రను సాగిస్తున్నది.విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన ఈ సినిమా ప్రీమియర్‌షోల నుంచే సంచలనాలతో దూసుకుపోతున్నదని, మున్ముందు మరిన్ని రికార్డులను అధిగమించడం ఖాయమని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 5న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.