మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, సీవీఎల్ నరసింహారావు, నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ ఓ అడుగుముందే ఉన్నాం. పోటీలో గెలిచే వారిని ఓటర్లు నిర్ణయిస్తారు. అక్టోబరు 3న మా ప్యానల్ ఎన్నికల ప్రణాళికను వెల్లడిస్తాం. రాజకీయాల జోక్యాలు, పరస్పర ఆరోపణలు లేకుండా సవ్వంగా మా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. వ్యక్తి గత ఆరోపణలతో పరిశ్రమ పరువు తీయవద్దు. ప్రకాశ్ రాజ్‌గారికి చిరంజీవిగారు మద్దతు ఇస్తున్నట్లు మా దగ్గర ఆధారాలు లేవు. ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తిగా ఆయన విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు అన్నారు జీవిత.
మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్స్ పరిశీలన 30 వరకు జరగనుంది. అక్టోబర్ 1`3 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోడానికి గడువు ఉంది. కాగా అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.