కొవిడ్ 19 విజృంభణ సమయంలో చైనా నుంచి భారత్‌కు వచ్చి తిరిగి ఆ దేశానికి వెళ్లలేక వేల సంఖ్యలో భారతీయులు అవస్థలు పడుతుంటే డ్రాగన్ దేశం మాత్రం తన ఆంక్షల్ని సమర్థించుకుంటోంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తాము క్వారంటైన్ వంటి సమయుచిత ఆంక్షలు విధించామనీ, అవి కేవలం భారతీయులను ఉద్దేశించినవి కావనీ, భారత్‌కు చిక్కుకుపోయిన చైనా దేశస్థులు స్వదేశానికి రాకుండా అవే ఆంక్షలు అడ్డుపడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ వివరించారు. ఇప్పట్లో ఆంక్షలను సడలించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. చైనా నుంచి భారత్‌కు వచ్చి తిరిగి చైనా చేరుకోలేకపోతున్న వారిలో విద్యార్థులు, వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, నౌకల సిబ్బంది దాదాపు 23,000 మంది ఉంటారని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)