ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ గరివిడి లక్ష్మి . టైటిల్‌రోల్ ఆనంది పోషిస్తున్నది. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఇటీవలే ఏపీలోని ఆదోనిలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మొదలు కాక ముందే విభిన్నంగా సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా గరివిడి లక్ష్మి వల్ల విశేష ప్రాచుర్యం పొందిన నల జిలకర మొగ్గ అనే జానపద గేయాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని ఈ పాట అక్కడి సంస్కృతికి, జానపద సంప్రదాయానికీ దర్పణంగా నిలిచిందని, ఉత్తరాంధ్ర సాంస్కృతిక చరిత్రలో గరివిడి లక్ష్మికి శాశ్వత స్థానాన్ని ఈ పాట సంపాదించిపెట్టిందని, యువతిలోని గంభీరత్వాన్ని తెలుపుతూ, శక్తివంత మైన సందేశాన్ని ఈ పాట అందించిందని, అక్కడి జనం తరతరాలుగా ఇష్టపడుతున్న క్లాసిక్ ఈ జానపదమని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు అన్నారు. నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.ఆదిత్య, సంగీతం: చరణ్ అర్జున్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.