పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రంప్‌పై అభియోగాలు నిరూపితమయ్యాయి. న్యూయార్క్ జడ్జి జువాన్ మెర్చాన్ తుది తీర్పు ఇచ్చారు. ట్రంప్‌ను దోషిగా పేర్కొన్న న్యాయమూర్తి, జైలుశిక్ష, జరిమానా విధించలేదు. ఈ మేరకు అన్‌కండీషనల్ డిశ్చార్జ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో దోషులకు నాలుగేండ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి చట్టానికి అతీతంగా ఉండే న్యాయపరమైన రక్షణ కారణంగా ట్రంప్‌నకు శిక్ష విధించలేదు. తనకు ఎలాగూ శిక్ష పడదనే కారణంతో ట్రంప్ కోర్టుకు కూడా హాజరుకాలేదు. కాగా, ఒక కేసులో దోషిగా తేలి అమెరికా అధ్యక్షుడు కాబోతున్న మొదటి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలవనున్నారు.