అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశపు మీడియాపై గుర్రుగా వున్నారు. సరైన ప్రశ్నలు వేయకుండా ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తున్నారన్న అభిప్రాయంతో ఆయన వున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయంపై అమెరికా మీడియాకు ఆయన చురుక అంటిస్తున్నారు కూడా. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా సొంత దేశ మీడియాను ఉద్దేశించి బైడెన్ మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై అమెరికా మీడియా భగ్గుమంది. బైడెన్ మాట్లాడుతూ తమ సొంత దేశ మీడియా కంటే ఇండియన్ మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించిందని అన్నారు. శ్వేతసౌధంలో మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల కోసం ఓవల్ కార్యాలయంలోకి వెళ్తూ వారు ఏం చేయబోతున్నారో ప్రెస్ లో చెప్పాలని అనుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను కొనసాగిస్తూ అమెరికాతో మీడియాతో పోలిస్తే భారత్ మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించింది. మీరు ఒకే అంటే కనుక మనం వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉందాం. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏం అడగాలో తెలియదు అంటూ మీడియాకు దొరికిపోయారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)