అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ క్యాపిటల్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్, ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌సైతం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భార్య ఉషా చిలుకూరి వాన్స్, ముగ్గురు పిల్లలూ ఆయన పక్కనే ఉన్నారు. తన భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఉషా వాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన భర్త వైపు ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.