గల్ఫ్ దేశం కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులవు కాదు. ఈ విషయంలో ప్రపంచంలోనే కువైత్ ఆరో స్థానంలో నిలిచింది. కువైత్ స్కోర్ 4.05/10గా నమోదైంది. కువైత్‌లో డ్రైవింగ్ టెస్టు ఫీజు వచ్చేసి సుమారు రూ.5,200 వరకు ఉంటుంది. దీనికితోడు ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎగ్జామ్, వైద్య పరీక్షలు అదనం. అందుకే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీగా దొరకదని తెలుస్తోంది. కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయసు 18 ఏళ్లు. అలాగే ఇతర కొన్ని విషయాలు కూడా ఆ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)