అమెరికాలో భారతీయ అమెరికన్ దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియా హౌస్ హూస్టన్ అనే స్వచ్ఛంధ సంస్థ నిర్మించిన క్రికెట్ స్టేడియానికి డా. దుర్గా అగర్వాల్, సుషీల్ అగర్వాల్ దంపతుల పేరు ఖరారైంది. పైపింగ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న డా. దుర్గా అగర్వాల్ ఇండియా హౌస్ సంస్థలో వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ స్టేడియం నిర్మాణంలో డా. అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు. తాను స్వయంగా విరాళం ఇవ్వడంతో పాటు భారతీయ అమెరికన్ల నుంచి కూడా నిధులు సేకరించారు. ఈ కొత్త స్టేడియం ఆవిష్కరణకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)