హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తమ ప్రచార షెడ్యూల్ని ప్రకటిస్తామని తెలిపారు. ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. హుజూరాబాద్ గెల్లు శ్రీనివాస్ తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)