పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడి ప్రజలకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు, ఇండ్లు కల్పించవచ్చని చెప్పారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజా యుద్దం తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.