పవన్ కల్యాణ్‌తో నిర్మాత ఎ.ఎం.రత్నంకు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం హరి హర వీరమల్లు రూపొందుతోంది. పవన్ కల్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో పవన్ కల్యాణ్ పోరాట యోధుడిగా నటిస్తున్నారు. కాగా, మంగళవారం ఏ.ఎం.రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరి హర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని అన్నారు. పవన్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా నిలుస్తుందని తెలిపారు.
చివరగా 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించారు పవన్ కళ్యాణ్. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హరి హర వీరమల్లుతో వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు, భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా హరి హర వీరమల్లు నిలుస్తుందని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు.