అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచే స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 250 మంది భారతీయులో కూడిన విమానం టెక్సాస్ నుంచి అమృత్సర్కు బయలుదేరింది. రాబోయే రోజుల్లో మరింత మందిని భారత్కు పంపించే అవకాశం ఉన్నది. వచ్చేవారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)