డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు అమెరికాలో వివిధ రంగాల్లో తమ సత్తా చాటిన భారతీయులు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యలకు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అమెరికా లో స్థిరపడి పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైతే అక్రమంగా వీసా గడువు తీరిపోయినప్పటికీ ఉన్నారో వారికి మాత్రం వేటు తప్పదని ట్రంప్ సర్కార్ చెబుతోంది.
ఇప్పటికే సరైన పత్రాలు లేని కారణంగా దాదాపు 205 భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసి యుద్ధ విమానం సీ-17లో భారతదేశం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మొదటి బ్యాచ్ లో అని గుర్తించాలి. భారతీయులతో పాటు ఇతర విదేశీయుల్ని కూడా ఇదే తరహాలో యుద్ధ విమానాల్లోనే ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున డబ్బు వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. కానీ గడచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడేందుకు వివిధ రకాల వీసాలను పొందుతూ పౌరసత్వం కోసం అనేక మార్గాలను అనుసరిస్తున్న వారికి మాత్రం డోనాల్డ్ ట్రంప్ రాక ఒక రకంగా చెప్పాలంటే చెక్ అని చెప్పవచ్చు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)