హీరో సిద్ధార్థ్, గణేష్ దర్శకత్వంలో మిడిల్ క్లాస్ కథతో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి 3 బీహెచ్ కె అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.సాధారణ గుమాస్తాగా ఉండే తండ్రి, ఇంట్లో అందరి పనులు చూసుకునే తల్లి, వారికి ఒక కొడుకు, కూతురు వారి కల.. నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని టైటిల్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమృత్ రామ్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.