పవన్ కల్యాణ్ తో పులి, మహేశ్ బాబు తో ఖలేజా వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీసిన నిర్మాత శింగనమల రమేశ్బాబు. ఓ కేసు విషయంలో 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి నిర్ధోషిగా నిరూపించుకున్న ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్ని. సినిమా మీదున్న ప్రేమతో నిర్మాతగా మారాను. పలు సినిమాలు నిర్మించాను. నా దగ్గరున్న స్థలాలను ఒకరికి తెలియకుండా, ఒకరికి అమ్మానని, నాపై కేసు పెట్టారు. 14 ఏళ్లు న్యాయం కోసం పోరాడాను. న్యాయస్థానంలో అది తప్పుడు కేసు అని రుజువైంది. కోర్టు నన్ను నిర్ధోషిగా తేల్చింది. నా సుదీర్ఘ న్యాయపోరాటం గెలిచింది. నాకు సినిమా తల్లిలాంటిది. నా పిల్లలు కూడా పరిశ్రమలోనే ఉన్నారు. భవిష్యత్తులోనూ మంచి కథాబలం ఉన్న సినిమాలు నిర్మిస్తాను. త్వరలోనే ఓ కొత్త సినిమాను ప్రకటిస్తాను. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతాను అని చెప్పారు.