అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురయ్యే ముప్పు పొంచి ఉంది. హెచ్1 బీ, ఎల్1 వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు తీర్మానం ప్రవేశ పెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమ్మిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందన్నారు. హెచ్1 బీ, ఎల్1 వీసాల గడువు పొడిగింపును పెంచుతూ బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకొంది. గతంలో ఇది కేవలం 180 రోజులు ఉండగా, గత సర్కారు 540 రోజులకు పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠిన వలసల నియంత్రణ , కఠిన వీసా రూల్స్కు ఇది అడ్డంకిగా మారుతుందని సెనెటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వ నిబంధనను 13 జనవరి 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. ఇది వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డ్ దారులు, హెచ్1 బీ, ఎల్1 వీసా దారుల భార్యలపై ప్రభావం చూపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)