Namaste NRI

నిదురించు జహాపన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్

ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం నిదురించు జహాపన. నవమి గయాక్, రోష్ని సాహోతా కథానాయికలు. కుమార్ దేవరపల్లి దర్శకత్వం. ఈ చిత్రానికి సామ్, వంశీకృష్ణవర్మ నిర్మాతలు. ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఒక ప్రేమకథకు, నిద్రకు సంబంధం ఏమిటన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ గా మెప్పిస్తుందని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని హీరో ఆనంద్ వర్ధన్ చెప్పారు. ఈ సినిమా కథ మొత్తం నిద్ర చుట్టే తిరుగుతుందని, వినూత్నమైన పాయింట్ తో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుందని దర్శకుడు తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పేర్కొన్నారు. ఈ నెల 14న విడుదలకానుంది. రామరాజు, పోసాని కృష్ణమురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News