Namaste NRI

వాళ్లందరికీ సమాధానమే …తల

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు రాగిన్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం తల. అంకిత నస్కర్ కథానాయిక. శ్రీనివాస్ గౌడ్ నిర్మాత. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ జీవితంలో చాలా స్ట్రగుల్స్ చూశాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. అమ్మ రాజశేఖర్ కు ఏమైందని ప్రశ్నించిన వారికి సమాధానంగా ఉంటుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు. 18 ఏళ్ల వయసున్న ఓ యువకుడు తన అమ్మ శ్రేయస్సు కోసం ఎంతదూరం వెళ్లాడన్నదే ఈ సినిమా ఇతివృత్తమని, మదర్సెంటిమెంట్, యాక్షన్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని హీరో రాగిన్ రాజ్ పేర్కొన్నాడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో వీఎన్ ఆదిత్య, నటుడు ప్రభాకర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News