దాదాపు మూడేండ్ల నుంచి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడబోతున్నదా? అంటే, ఔను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో సంభాషించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా తమ బృందాలు వెంటనే చర్చలు ప్రారంభించేందుకు ఇద్దరమూ అంగీకరించామని ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య సంభాషణను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి తెలపడం ద్వారా చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. చర్చలకు నేతృత్వం వహించే బాధ్యతను ఆయన పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు. కాగా, దాదాపు గంటన్నర పాటు ట్రంప్, పుతిన్ ఫోన్ మాట్లాడుకున్నారని, ట్రంప్ ను మాస్కోలో పర్యటించాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారని రష్యా వర్గాలు తెలిపాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tulsi-300x160.jpg)