Skip to main content

Namaste NRI

ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత

దక్షిణ కొరియా నటి కిమ్ సే-రాన్ మృతిచెందింది. ఆమె వయసు 24 ఏళ్లు. సింగ్షు డాంగ్ జిల్లా లో తన ఇంట్లో ఆమె శవమై తేలారు. ఆమె ఫ్రెండ్ మృత దేహాన్ని గుర్తించింది. మృతి పట్ల అనుమానాలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఏ కారణం చేత ఆమె ప్రాణాలు కోల్పోయిందో అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కిమ్ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్టు గా ప్రారంభించారు. దక్షిణ కొరియా లో ఎదుగుతున్న యువ హీరోయిన్ గా ఆమెను భావించారు. 2000 సంవత్సరంలో ఆమె సియోల్ లో జన్మించారు. 2009లో రిలీజైన ఏ బ్రాండ్ న్యూ లైఫ్ ఫిల్మ్ తో ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కనిపించారు.
2010లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన ద మ్యాన్ ఫ్రమ్ నోవేర్, 21012 తీసిన థ్రిల్లర్ ద నైబర్ చిత్రాల్లో ఆమె నటించింది. 2014లో రిలీజైన ఎ గర్ల్ ఎట్ మై డోర్, 2016 ప్రసారమైన మిర్రర్ ఆఫ్ ద విచ్ టీవీ సిరీస్ లో నటించింది. 2022లో ఆమె పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. 2023 ఏప్రిల్లో ఆమెకు 11 వేల పౌండ్ల ఫైన్ వేశారు. 2023లో వచ్చిన కొరియా డ్రామా బ్లడ్హూండ్స్ లో ఆమె చివరిసారి నటించింది. డ్రంకెన్ డ్రైవ్ కేసు తర్వాత ఆమె కష్టాలు మొదలయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events