సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం అనగనగా. కాజల్ చౌదరి కథానాయిక. సన్నీ సంజయ్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో సుమంత్ ఉపాధ్యాయుడిగా కనిపించారు.

పిల్లలకు పాఠాలు ఎలా చెబితే అర్థమవుతాయో వివరిస్తూ ఆయన కనిపించారు. నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేది ఏంటి? అంటూ సుమంత్ సంధించిన పొడుపుకథ టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో సుమంత్ క్లాస్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారని, కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్ పాత్రలు కూడా అలరిస్తాయని, మనసుల్ని హత్తుకునే కథాంశంతో దర్శకుడు సినిమాను మలిచారని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్ పప్పుల, సంగీతం: చందు రవి.
