
నాని హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా హిట్3. శ్రీనిధి శెట్టి కథానాయిక. దర్శకుడు శైలేష్ కొలను. నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. పోలీసులను కలవరపెట్టే వరుస హత్యల నేపథ్యంలో ఈ టీజర్ మొదలైంది. హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. చివరి ప్రయత్నంలో టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్‌ని పోలీసులు ఆశ్రయించారు. ఇలా ఆద్యంతం ఉత్కంఠగా టీజర్ సాగింది.

ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని, కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్‌లో ఓ నేరస్థుడ్ని కసిగా పొడిచి, కత్తిని పైకి లాగడం, ఆ రక్తం రూఫ్‌పై చిమ్మడం ఆ పాత్ర క్రూరత్వాన్ని వెల్లడిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, నిర్మాణం: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.
