
పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తుంది. హరిహరవీరమల్లు పార్ట్-1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వినాలి వీరమల్లు మాట వినాలి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేయగా మంచి స్పందన వస్తోంది. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

నిధి అగర్వాల్, పవన్ కల్యాణ్, అనసూయ క్రేజీ కాంబోలో కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజిషన్‌లో మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల పాడారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
