
జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా, దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే చిత్ర జపాన్‌కి వెళుతుంది.

ఎన్టీఆర్ చిత్రాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు తారక్. ఇందులో భాగంగానే జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మరోవైపు దేవర ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 22న జపాన్‌కి వెళ్లనున్నాడు ఎన్టీఆర్.















