Namaste NRI

హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఈ ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ దినోత్సవం భాషా వైవిధ్యం, బహుభాషావాదాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, హాంకాంగ్‌లోని వివిధ భాషా సమాజాల నుండి ప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు. వివిధ భాషలలో కవితలు, కథలు, ప్రదర్శనలు, పాటలు, జానపద నృత్యాలు పంచుకున్నా రు. ఈ వేడుకలో కాంటోనీస్, కుర్దిష్, బంగ్లా, మరాఠీ, రొమేనియన్, కన్నడ, సంస్కృతం, హిందీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, నేపాలీ తదితర భాషల సాహిత్య గొప్పదనాన్ని చూపించారు.

ఈ వేడుక ప్రజలను అనుసంధానించడం లోను, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం లోనూ భాషకున్న శక్తిని ప్రదర్శించిందని నిర్వాహకులు అన్నారు. అతిథులు తమ అనుభవాలను పంచుకుని, మాతృభాషల ప్రాముఖ్యత గురించి చర్చించారు. భాషకు ప్రాముఖ్యతనిచ్చే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో అద్భుతంగ నిర్వహించినందుకు తెలుగు సమాఖ్యని, జయ పీసపాటిని ప్రశంసించి అభినందించారు.

యునెస్కో వారి గ్లోకల్ పీస్ సెంటర్ కార్యకర్త శ్రీ తిరునాచ్ నాచియప్పన్ సహాయ సహకారాలను, ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ది హంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటిని మాట్లాడుతూ  హంగ్ కాంగ్‌లో మొదటి సారిగా తమ సంస్థ మాత్రమే 2021 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకి, పిల్లలకు వారి తల్లి తండ్రులకు, గౌరవ్ అతిథులకు, నిర్వహణలో సహకరించిన వారందరికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వీరే….

1.మిస్టర్ యూజీన్ ఫాంగ్, పార్టనర్‌షిప్ ఎంగేజ్‌మెంట్ చైర్, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్

2. మిస్టర్ మార్కో క్వాంగ్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్, యునెస్కో హెచ్‌కే అసోసియేషన్ – గ్లోకల్ పీస్ సెంటర్

3. మిస్టర్ అష్ఫాకుర్ రెహమాన్, బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షుడు

4. శ్రీమతి రీటా గురుంగ్, హాంకాంగ్ నేపాల్ ఫెడరేషన్ చైర్‌పర్సన్

5. మిస్టర్ మెసుట్ టెమెల్, ఆంటోలియా కల్చరల్ అండ్ డైలాగ్ సెంటర్ చైర్మన్

6. మిస్టర్ థాపా చురా బహదూర్, సర్ ఎల్లిస్ కడూరీ సెకండరీ స్కూల్ (వెస్ట్ కౌలూన్)లో ఎన్ఈటీ టీచర్, టీచర్/రచయిత/రచయిత

7. మిస్టర్. తిరుపతి నాచియప్పన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్ సహ-చైర్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events