Skip to main content

Namaste NRI

క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కుబేర..  రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ధనుష్‌, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం కుబేర.  యువతరానికి నచ్చే కథలతో సినిమాలు చేసే శేఖర్‌ కమ్ముల,  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ని మెయిన్‌లీడ్‌గా తీసుకొని సినిమా చేయడం, దానికితోడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటం, ప్రచార చిత్రాల్లో విభిన్నత, శేఖర్‌ కమ్ముల సినిమాకు దేవిశ్రీ సంగీతం,  ఇవన్నీ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణాలు.   కుబేర రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌  ప్రకటించారు. జూన్‌ 20న ప్రపంచవ్యాప్తంగా కుబేర  విడుదల కానుంది.

విభిన్నమైన కథాంశంతో నెవర్‌ బిఫోర్‌ అనిపించేలా శేఖర్‌ కమ్ముల ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని, ధనుష్‌, నాగార్జున, రష్మిక, జిమ్‌ సర్భ్‌ పాత్రలు,  ఆ పాత్రల చుట్టూ తిరిగే కథనం,  ఉద్వేగాలు ఊహలకు అతీతంగా ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలనూ ఈ పోస్టర్‌ ద్వారా మేకర్స్‌ మరోసారి పరిచయం చేశారు. ఎస్వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News