Skip to main content

Namaste NRI

రష్యాకు వ్యతిరేకంగా సైబర్ సమరం ఆపండి : అమెరికా

అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రష్యాకు వ్యతిరేకంగా చేపడుతోన్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.  ఉక్రెయిన్,  రష్యా మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ విషయంలో పుతిన్‌కు అనుకూలంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని నిందిస్తుండటం చర్చనీయాంశ అవుతోంది. ఇటీవల జెలెన్‌స్కీతో శ్వేతసౌధంలో జరిగిన భేటీలో కూడా మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. సైబర్ ఇంటెలిజెన్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తాము బహిరంగంగా పంచుకోలేమని తెలిపింది.

Social Share Spread Message

Latest News