Namaste NRI

రామ్ చరణ్ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టిన శివన్న

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతోన్న RC 16 (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్‌ కథానాయిక.  ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో మైసూర్‌ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ మధ్యే హైదరాబాద్‌ షెడ్యూల్‌ కూడా పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లోనే ఆయన జాయిన్‌ కానున్నారు. ఈ సందర్భంగా శివన్న లుక్‌ టెస్ట్‌ని కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను మేకర్స్‌ విడుదల చేశారు. జగపతిబాబు, మీర్జాపూర్‌ ఫేం దివ్యాంశు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాత: వెంకట్‌ సతీష్‌ కిలారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events