Skip to main content

Namaste NRI

ఈ ప్రతిపాదనకు హమాస్‌ ఒప్పుకోకుంటే.. అంతం చేస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వాషింగ్టన్‌ డీసీలో చర్చలు జరిపిన అనంతరం గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అంగీకరించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలస్తీనాలో దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన 20 సూత్రాల ప్రణాళికను వారు విడుదల చేశారు. కాల్పుల విరమణ విధివిధానాలను స్థూలంగా వివరించిన ట్రంప్‌ గాజాలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు, బందీల విడుదలకు, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దీన్ని రూపొందించినట్లు చెప్పారు.ఈ ప్రతిపాదనలకు హమాస్‌ అంగీకరించని పక్షంలో ఆ గ్రూపును పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రంప్‌ ప్రకటించారు.

గాజాలో శాంతి స్థాపనే ఈ ప్రణాళిక లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. హమాస్‌ తన ఆయుధాలను పూర్తిగా వదిలిపెట్టాలని, గాజాలో శాంతియుత ప్రభుత్వం ఏర్పడాలని ఆయన చెప్పారు.గాజా నుంచి తన బలగాలను ఇజ్రాయెల్‌ క్రమంగా ఉపసంహరించుకుంటుందని హామీ ఇస్తూ అయితే సులంభంగానైనా క్లిష్టంగానైనా ప్రక్రియను కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ 9న ఖతార్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి నెతన్యాహు క్షమాపణ చెప్పారు.

Social Share Spread Message

Latest News