Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ఫార్ములాను స్వాగతించిన భారత్‌

 ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. గాజాలో యుద్ధం  ముగింపుకు ట్రంప్‌ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్లాన్‌ను పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. తాజాగా గాజాపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికను భారత్‌ కూడా స్వాగతించింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ట్రంప్‌ చేసిన ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ట్రంప్‌ ప్రణాళిక పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News