
కెనడా ప్రధాన మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి జనవరిలో రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ నూతన నేతను ఎన్నుకునే వరకు ట్రూడో ఆ పదవిలో కొనసాగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన నేపథ్యంలో నూతన ప్రధాని అయిన మార్క్‌పై ప్రత్యేక బాధ్యత ఉంది. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మార్క్ మాట్లాడుతూ, కెనడా సార్వభౌమాధికారాన్ని ట్రంప్ గౌరవిస్తే, తాను ఆయనతో చర్చలు జరుపుతానని చెప్పారు. మార్క్ త్వరలో సాధారణ ఎన్నికలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
