
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యు.కె.పార్లమెంట్లో గౌరవ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికీ, సమాజానికీ సేవలందించినందుకు గాను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చిరంజీవిని వరించింది. యు.కె.కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా ఈనెల 19న యు.కె.పార్లమెంట్లో చిరంజీవిని సన్మానిస్తారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే వేదికపై యూకేలో పేరెన్నికగన్న బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అందిస్తున్న తొలి లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఇదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
