Namaste NRI

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానం

జులై 4,5,6 తేదీల్లో ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అమెరికాలో తెలుగువారందరూ కలిసి చేసుకునే పండుగ అమెరికా తెలుగు సంబరాలని.. ఈ సంబరాల్లో పాలుపంచుకుంటే తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని నాట్స్ బృందం సభ్యులు చంద్రబాబును అభ్యర్థించారు. సంబరాల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నాట్స్ బృందం చంద్రబాబుకు వివరించింది. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

నాట్స్ ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫ్లోరిడాలో జరిగే నాట్స్ సంబరాలకు రావలసిందిగా ఆహ్వానింనించారు.

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events